బడ్జెట్ లిమిట్ క్రాస్ అయిన స్పైడర్..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 120 కోట్ల దాకా పెట్టారని టాక్. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందిలో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాకు మరో 10 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట.

ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రెండు పాటలు మిగిలున్నాయట. సినిమా కోసం స్పెషల్ గా విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తున్నారట. దానికే అదనపు 10 కోట్లు ర్చు అవుతున్నాయట. శ్రీమంతుడు సూపర్ హిట్ తర్వాత మహేష్ బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది. అయినా సరే మహేష్ మార్కెట్ మీద ఉన్న నమ్మకంతో పెట్టుకుంటూ పోతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నా ఇంకా బడ్జెట్ కేటాయించడం అంటే కాస్త కంగారుగా ఉంది. బాహుబలి కాకుండా సౌత్ లో ఈ రేంజ్ లో బడ్జెట్ లో వస్తున్న సినిమా స్పైడర్ అనే చెప్పొచ్చు.