బాబి టార్గెట్ పవర్ స్టారేనా..!

రచయితగా పలు సినిమాలకు పనిచేసి పవర్ సినిమాతో దర్శకుడిగా మారాడు కె.ఎస్. రవింద్ర అలియాస్ బాబి. రవితేజ హీరోగా వచ్చిన పవర్ హిట్ అందుకోగా ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్షన్ ఛాన్స్ అందుకున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రస్తుతం ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమా చేస్తున్నాడు బాబి.

రీసెంట్ గా తారక్ పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటుగా ఎన్.టి.ఆర్ టాలెంట్ కు తెలుగు రాష్ట్రాల హద్దులు సరిపోవని ఆకాశానికెత్తాడు బాబి. అంతేకాదు ఒక్కసారి కథ ఫైనల్ చేశాక షూటింగ్ లో అసలు పట్టించుకోడని అన్నాడు. బాబి చేసిన ఈ కామెంట్స్ ఓరకంగా సర్దార్ విషయంలో పవర్ స్టార్ జోక్యం గురించే అనుకోవచ్చు. డైరెక్ట్ గా అనకపోయినా తన మనసులోని మాట బయటపెట్టాడు బాబి. అయితే బాబి కామెంట్స్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇక దర్శక నిర్మాతలు ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరో గ్రేట్ మిగతా వారంతా ఆయన తర్వాత అని భజన చేయడం కామనే. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ ను పొగడటం కూడా అదే తరహానే అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు.