
తెలుగులో ఉన్న విలక్షణ నటులలో తాను ఒకడన్న పేరు తెచ్చుకున్న శర్వానంద్ కెరియర్ మొదటి నుండి విభిన్న కథలను చేసుకుంటూ వచ్చాడు. వరుస హిట్ సినిమాలను ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. శర్వానంద్ రీసెంట్ మూవీ రాధ మాత్రం అతన్ని వెనక్కి నెట్టేసింది. శర్వానంద్ ఇలాంటి రొటీన్ సినిమా చేస్తాడా అన్న ఆలోచన వచ్చింది.
ఓ పక్క కుర్ర హీరోలేమో కొత్త కథలతో కంటెంట్ బేస్డ్ మూవీస్ తో అలరిస్తుంటే రొటీన్ ఎంటర్టైనర్ సినిమాతో శర్వానంద్ రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి రాధ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కాని బాహుబలి ధాటికి తట్టుకోలేకపోయింది. మరి ఇకనుండైనా శర్వానంద్ కథల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటే మంచిది లేదంటే తన ప్లేస్ లో వేరే హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.