
రీసెంట్ గా జరిగిన రారండోయ్ వేడుక చుద్దాం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న ప్రశ్నను అందరిని అడగటం ఆ క్రమంలోనే చలపతి రావు ఆడవాళ్ల మీద అసభ్యకరమైన మాటాలు మాట్లాడటం జరిగింది. ఈ విషయంపై గొడవ పెద్దదవుతుంది. మహిళా సంఘాల దాకా విషయం వెళ్లడంతో వెంటనే చలపతి రావు తాను దురుద్దేశంతో అలా మాట్లాడలేదని అన్నారు. తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించమని అడిగారు.
ఇదే విషయంపై ఈరోజు ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని అందించారు నాగార్జున. పర్సనల్ గా తను ఇంకా తన సినిమాల్లో ఆడవాళ్లను గౌరవిస్తానని. చలపతి రావు చేసిన కామెంట్స్ ను నేను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. సినిమా నిర్మాత అది కూడా కొడుకు సినిమా ఆడియో నాడు జరిగిన రచ్చ కాబట్టి దీన్ని మరి పెద్దదిగా చేయకుండా నాగార్జున స్పందించి విషయం ఇంతటితో వదిలేయాలి అన్నట్టు చూస్తున్నాడు.