
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన కళ్యాణ్ కృష్ణ తన సెకండ్ మూవీ నాగ చైతన్య హీరోగా రారండోయ్ వేడుక చుద్దాం చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కింగ్ నాగార్జున నిర్మించిన ఈ మూవీ మే 26న రిలీజ్ కు రెడీ అవుతుంది.
సినిమా ప్రమోషన్స్ లో చలాకీగా పాల్గొంటున్న రకుల్ తను చేసిన భ్రమరాంబ పాత్ర బాగా వచ్చిందని. ఇన్నాళ్ల తన కెరియర్ లో అలా ఆలోచించకుండా గుర్తొచ్చే పాత్ర ఇదే అని అంటుంది. అంతేకాదు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ తర్వాత ఏ సినిమా చేసినా అందులో తననే హీరోయిన్ గా పెట్టుకోవాలని అతనికి వార్నింగ్ కూడా ఇచ్చిందట. అదేంటి డైరక్టర్ కు వార్నింగ్ ఇచ్చి చెప్పడం ఏంటి అంతే అతనితో ఉన్న చనువు కొద్ది అలా సరదాగా చెప్పేసిందట రకుల్. సో మొత్తానికి భ్రమరాంబగా రకుల్ అదరగొట్టేందుకు సిద్ధమైందని తెలుస్తుంది.