డెడ్ లైన్ పెట్టేసిన సమంత..!

స్టార్ హీరోయిన్ గా సమంత క్రేజ్ గురించి తెలిసిందే. నాగ చైతన్యతో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న అమ్మడు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా రాబోతున్న సినిమాను కూడా ఆగష్టు చివరి కల్లా పూర్తి చేయమని చెప్పిందట. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విపరీతమైన ఎండల వల్ల రెండు సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

మరి ఇప్పుడేమో సమంత ఆగష్టు చివరిదాకా మాత్రమే తాను ఎవైలబుల్ అంటుంది. ఈలోగా సినిమా మొత్తం కాకపోయినా కనీసం సమంత పార్ట్ వరకైనా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు సుకుమార్ అండ్ టీం. సమంత పెట్టిన డెడ్ లైన్ ప్రస్తుతం చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చింది. అక్టోబర్ లో నాగ చైతన్యతో వివాహం జరుపుకోనున్న సమంత మళ్లీ డిసెంబర్ లో ఫ్రీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.