
సీనియర్లు కదా అని చలాకీతనం ప్రవర్తిస్తే అది కాస్త నోటిధూల అనేలా చేసింది. ఇంతకీ దేని గురించి అంటే రీసెంట్ గా జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ యక్టర్ చలపతిరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. ఆడాళ్లు పక్కలోకి పనికొస్తారు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు చలపతి రావు.
'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అన్న ప్రశ్నకు సమాధానంగా చలపతి రావు పేల్చిన బాంబ్ ఇది. ఆయన ఏ ట్రాన్స్ లో ఉండి అన్నాడో కాని ఆ కామెంట్ మీద ఇప్పుడు లేడీస్ అంతా అగ్గి మీద గుగ్గిలవుతున్నారు. ఆడాలంటే అంత చులకన భావన ఎందుకని ప్రశ్నలను సంధిస్తున్నారు. ఒకప్పుడు విలన్ గా, ఆ తర్వాత కమెడియన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి బాబాయ్ పాత్రల్లో నటించిన చలపతి రావు నోటి వెంట ఆడవాళ్ల గురించి ఇలాంటి అసభ్యకరమైన మాటలు రావడం దుదృష్టకరం. మరి తాను అన్న మాటలకు వస్తున్న విమర్శలకు చలపతి రావు ఏమన్నా సమాధానం ఇస్తారో లేదో చూడాలి.