స్వీటీ పూజలు పెళ్లికోసమేనా ..!

బాహుబలితో మరో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న స్వీటీ అనుష్క సడెన్ గా ఉన్నట్టుండి కర్ణాటక కొల్లూరులోని మూకాంబా అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేయించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన ఫ్యామిలీతో  వెళ్లి పూజలు చేయించిందట అనుష్క. ఈ విషయం తెలిసిన వారంతా ఈ పూజలు అనుష్క పెళ్లి కోసమే అని అంటున్నారు.  

కేవలం ఫ్యామిలీతో మాత్రమే వెళ్లిందంటే కచ్చితంగా అనుష్క పెళ్లి గురించే ఈ ప్రత్యేక పూజలని అంటున్నారు. కాని అనుష్క ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం బాహుబలి విజయం సాధించింది కాబట్టి అందరం కలిసి గుడికి వచ్చామే తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదంటూ చెబుతున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది మాత్రం బయటపడనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక పెళ్లి ప్రస్తావన వస్తే అనుష్క కూడా కచ్చితమైన నిర్ణయం ఏది ఇప్పటిదాకా చెప్పలేదు మరి అమ్మడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదా లేక ఎవరికీ చెప్పకుండా సడెన్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.