సూపర్ కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్..!

ఇజం ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన కళ్యాణ్ ఎట్టకేలకు ఓ క్రేజీ కాంబినేషన్ కు సై అన్నాడు. తెలుగుం దర్శకులను నమ్ముకుంటే లాభం లేదు అనుకున్నాడో ఏమో కాని ఈసారి తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. సిద్ధార్థ్, ప్రియా ఆనంద్, నిత్యా మీనన్ లు లీడ్ రోల్ లో నటించిన 180 సినిమా చేసిన జయేంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.    

ఇక ఈ సినిమాకు పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. 180 సినిమా తర్వాత రాజేంద్ర చేస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ రాం ను సెలెక్ట్ చేసుకున్నారు. కళ్యాణ్ రాంతో ఈ కాంబినేషన్ క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో జై లవకుశ నిర్మిస్తున్న కళ్యాణ్ రాం ఆ సినిమా నిర్మాణ కార్యక్రమాలను చూసుకుంటూనే తన సినిమా చేయాలని చూస్తున్నాడు.