యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ'..!

హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి యాంకర్ గా క్లిక్ అయ్యాడు రవి. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యాంకర్ రవి హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమానే ఇది మా ప్రేమకథ. అయోధ్య కార్తిక్ డైర్కషన్ లో వస్తున్న ఈ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో వస్తుందని శశిరేఖా పరిణయం సీరియల్ లో లీడ్ రోల్ చేసిన మేఘన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

ఇది మా లవ్ స్టోరీ అంటూ ఓ సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ చెప్పబోతున్నట్టు కనిపిస్తుంది యాంకర్ రవి. హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అందిస్తుందో చూడాలి. షార్ట్ ఫిలిమ్స్ తో పాటుగా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేస్తున్న రవి హీరోగా సక్సెస్ ఎలాంటి ఇమేజ్ ఏర్పరచుకుంటాడో త్వరలో తెలుస్తుంది.