
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ మణిరత్నం సినిమా చేస్తాడని తెలిసిందే. చెలియా ఫ్లాప్ తర్వాత మణిరత్నం సినిమా గురించి ఆలోచనలో పడినా ఈమధ్యనే మణిరత్నం తో స్టోరీ డిస్కషన్స్ జరిపాడట చరణ్. కథ నేరేషన్ చాలా బాగా రావడంతో సినిమా చేసేద్దాం అన్నాడట.
ఈ సినిమాకు 'యోధ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఫ్లాప్ డైరక్టర్స్ కు అవకాశం ఇవ్వడంలో మెగా హీరోలు ముందుంటారు అందులో చరణ్ కథ నచ్చితే చాలు ఆ దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్నా సరే అతనికి అవకాశం ఇచ్చేస్తాడు. అలా అవకాశం ఇచ్చిన వారు కొందరు హిట్ ఇస్తే మరికొందరు ఫ్లాపులిచ్చారు. మరి రాం చరణ్ మణిరత్నం యోధ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా గురించి అఫిషియల్ స్టేట్మెంట్ తో పాటుగా సినిమాలో మిగతా నటీనటులను కూడా త్వరలో వెళ్లడిస్తారట.