ఆ సీన్ 40 టేకులు చేశానన్న తారక్..!

టాలీవుడ్ లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లలో ముందు వరుసలో ఉండే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఓ సీన్ కోసం 40 టేకులు తీసుకున్నాడట. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా తారక్ 40 టేకులు తీసిన సినిమాలో సీన్ ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో బాల్ సీక్వన్స్ ను మొదట టేక్ కే ఓకే చేసినట్టు కనిపించగా ఆ సీన్ కోసం దాదాపు 40 టేకులను తీశాడట సుకుమార్. ఒకదానికిమించి మరోటి రావడంతో అన్ని టేకులు తీశాడని రీసెంట్ గా సుకుమార్ నిర్మాణంలో వస్తున్న దర్శకుడు సినిమా టీజర్ రిలీ కార్యక్రమంలో బయట పెట్టాడు తారక్.

ఈ టీజర్ రిలీజ్ కు తానో అతిధిగా రాలేదని.. అలా అని చెప్పి తనని బయట వాడిని చేయొద్ధని అన్నాడు తారక్. సుకుమార్ కథ నమ్మి సినిమా తీసే దర్శకుడు తన కెరియర్ లో నాన్నకు ప్రేమతో ఓ మంచి సినిమా. ఇక తన నిర్మాణంలో వస్తున్న దర్శకుడు సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని అన్నారు. హరి ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న ఈ దర్శకుడు సినిమా జూన్ రెండవ వారంలో రిలీజ్ అవుతుంది.