బాబోయ్ ఆమెకు అన్నీ ఆ ఆఫర్లేనా..!

ఏదో ఒక అవకాశం కదా అని చేసేస్తే ఇప్పుడు ఆ సినిమా చేసినందుకు అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయని అంటుంది బాబు బాగా బిజీలో హాట్ ఆంటీ రోల్ చేసిన సుప్రియ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఓ చిన్న పాత్ర చేసిన అమ్మడు బిజీ బాబుతో లిప్ లాకులతో రచ్చ రచ్చ చేసింది. సినిమా ఫ్లాప్ అయినా సుప్రియకు మాత్రం మంచి లైఫ్ ఇచ్చింది.

సినిమా చూసిన దర్శక నిర్మాతలు తమ సినిమాలో కూడా అలాంటి పాత్ర ఉందని అంటున్నారట. హీరోయిన్ గా సెక్సీ గా కనిపించడం ఒకే కాని.. కేవలం అలాంటి సినిమాల్లోనో లేక అలాంటి పాత్రలనే ఆఫర్ చేస్తున్న వారికి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందట సుప్రియ. బాబు బాగా బిజీ దాకా ఎవరో తెలియని ఈ భామ ఇప్పుడు ఈ రేంజ్ హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవడం చూస్తుంటే అనుకుంటున్నట్టుగా ఆమె హీరోయిన్ గా కూడా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పొచ్చు.