
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న స్పైడర్ మూవీ ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. బ్రహ్మోత్సవం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే సినిమా స్టార్ట్ చేసిన మహేష్ ఇంకా షూటింగ్ పూర్తి చేయకపోవడంతో డైరక్టర్ మురుగదాస్ పట్ల అసహనంతో ఉన్నాడని టాక్. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప టీజర్ కూడా లేట్ చేస్తున్న కారణంగా మురుగదాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట మహేష్.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో రిలీజ్ డేట్ చూసుకుని ఇక్కడ కన్ఫాం చేయాలని చూస్తున్నారట. జూన్ 23న రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఆగష్టుకి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టులో కూడా ఈ సినిమా కష్టమే అని అంటున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. మరి ఆరోజైనా రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి. మహేష్ స్పై ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.