
యువ హీరోలలో వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న రాజ్ తరుణ్ త్వరలో అంధగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ అంధగాడుగా కూడా అదరగొట్టేందుకు జూన్ 2న వస్తున్నాడు. రచయితగా ఇన్నాళ్లు సినిమాలకు కథలనందించిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అంధగాడు ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది.
రాజ్ తరుణ్ తో మరోసారి హెబ్భా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేసింది. తన మార్క్ కామెడీ మిస్ అవకుండానే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు రాజ్ తరుణ్. ట్రిలర్ లో అంధునిగా రాజ్ యాక్షన్ ఆకట్టుకుంది. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. ఏకే ఎంటర్టైన్మేంట్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలవనుంది.