ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈరోజు తన బర్త్ డే కానుకగా రెండు సర్ ప్రైజులు ఇచ్చాడు. నిన్న సాయంత్రమే ప్రస్తుతం నటిస్తున్న బాబి సినిమా జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన తారక్ ఈరోజు కొరటాల శివ తో మూవీకి ముహుర్తం పెట్టేశారు. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ కొరటాల శివతో తారక్ సినిమా చేస్తుండటం విశేషం.   

మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా యువ సుధా బ్యానర్లో నిర్మితమవుతుంది. ఈరోజు తారక్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. జై లవకుశ పూర్తి చేశాక త్రివిక్రం తో సినిమా ఉంటుందనుకుంటే కొరటాల శివతో సినిమా చేసి అందరికి షాక్ ఇచ్చాడు ఎన్.టి.ఆర్. జై లవకుసలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో సంకెళ్ళతో తారక్ అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు.