నిఖిల్ మళ్లీ అతనితోనే..!

యువ హీరో నిఖిల్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడని తెలిసిందే. స్వామిరారా నుండి నిన్న రిలీజ్ అయిన కేశవ వరకు నిఖిల్ కథ కథనాల్లో కొత్తదనం చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. సుధీర్ వర్మ డైరక్షన్ లో వచ్చిన కేశవ సినిమా అంచనాలను అందుకుని సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇక పెద్దగా గ్యాప్ ఏమి ఇవ్వకుండా తన కొత్త సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు నిఖిల్.

తనతో కార్తికేయ సినిమా తీసిన దర్శకుడు చందు మొండేటి డైరక్షన్ లో తన తర్వాత సినిమా ఖాయం చేశాడు నిఖిల్. ఈ సినిమా కార్తికేయకు పక్కా సీక్వల్ గా వస్తుందట. కార్తికేయ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడ నుండి పార్ట్ 2 సినిమా స్టార్ట్ అవుతుందట. కార్తికేయతో మొదటి సినిమా అద్భుత ప్రతిభ చాటుకున్న చందు ఆ తర్వాత మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమం రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి నిఖిల్ తో కార్తికేయ-2 చేయబోతున్నాడు. మరి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీక్వల్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.