నేను గొర్రెను కాదు : కమల్ హాసన్..!

బాహుబలి సినిమా గురించి అందరు పాజిటివ్ గా రియాక్ట్ అయినవాళ్లే కాని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమా రిలీజ్ అయిన టైంలో ఆర్ధికంగా ఇలాంటి సినిమా కావాలని కాని హాలీవుడ్ కు మించి బాహుబలి ఉంది అనడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి లాంటి సినిమా తీస్తారా అంటే తానేను ఏమి గొర్రెను కాదు కనీసం గొర్రెల కాపరని కూడా కాదని సంచలనం కామెంట్ చేశాడు కమల్. 

గొర్రెల మందలా హిట్ సినిమా ఫార్మెట్ లో వెళ్లే టైప్ తనది కాదని కమల్ మాటల్లోని అర్ధం. ఎలాంటి టెక్నాలజీ సహాయం లేకుండా అప్పట్లోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన కమల్ హాసన్ ను బాహుబలి లాంటి సినిమా చేస్తారా అని అడగడం పొరపాటే అని అనొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 1500 కోట్ల కలక్షన్స్ సాధించినా ఆ సినిమాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయన్నది కమల్ లాంటి సిని పండితులు అంకుంటున్న లోపల మాట.