రూమర్స్ కు చెక్ పెట్టిన నాగార్జున

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులను హుశారెత్తిస్తుండగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం నిన్న ఉదయం నాగార్జున బావ సత్యభూషణ్ రావు మరణించడమే అంటున్నారు. నిన్న జరగాల్సిన రారండోయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అందుకే క్యాన్సిల్ చేశారు.            

ఇక ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా పడి.. చిత్రయూనిట్ చెవిన పడింది. సినిమా వాయిదా పై వారు స్పందిస్తూ మే 26న రారండోయ్ వేడుక చూద్దాం రావడం పక్కా దీనిలో ఎలాంటి సందేహాలు లేవని అంటున్నారు. నాగార్జున కూడా జూన్ 2న రిలీజ్ అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ సినిమా ప్రమోషన్స్ మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం ఆల్బం ఇప్పటికే శ్రోతలను అలరిస్తుంది.