ఎన్టీఆర్ జై లవకుశ ఫస్ట్ లుక్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రేపు అనగా మే 20 తారక్ పుట్టినరోజు సందర్భంగా ఓ రోజు ముందే జై లవకుశ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన జై లవకుశ ఫస్ట్ లుక్ అదుర్స్ అనేలా ఉంది. 


రెండు పోస్టర్స్ లో బ్లాక్ అండ్ బ్లాక్ తో కనిపించిన తారక్ ఒక పోస్టర్ లో సంకెళ్లతో దండం పెడుతూ వారెవా అనిపించాడు. తారక్ ఫ్యాన్స్ కు ఈ ఫస్ట్ లుక్ ఇచ్చిన కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఎన్.టి.ఆర్ ఎకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీ గ్యారెంటీ అన్నట్టే ఉంది.