ప్రభాస్ సాహో 400 కోట్ల బంపరాఫర్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈరోస్ ఇంటర్నేషనల్ నుండి బంపరాఫర్ వచ్చిందట. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు భాషల థియేటిరికల్ రైట్స్ మొత్తం 400 కోట్లకు ఆఫర్ చేశారట ఈరోస్ వారు. 

కళ్లుచెదిరే ఈ ఆఫర్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్లు చేయడం తన రేంజ్ ఏంటో చూపిస్తుందని చెప్పొచ్చు. రన్ రాజా రన్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీస్తున్నారట. ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న ప్రభాస్ అది ముగించుకుని వచ్చాకా సాహో షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.