
యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిఖిల్ ఈరోజు కేశవగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ టాక్ బాగున్నా ఓ పక్క బాహుబలి హవా ఇంకా కొనసాగుతున్న ఈ తరుణంలో తన సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందని కాస్త టెన్షన్ లో ఉన్నాడు నిఖిల్. ఇక ఈ సినిమా దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మరి ఎలా వచ్చిందో ఏమో కాని ఈ సినిమా కూడా సుధీర్ వర్మ కాపీ చేశాడంటూ వార్తలొస్తున్నాయి. హాలీవుడ్ సినిమా క్రాంక్ మూవీ ఫ్రీమేక్ చేశాడని సుధీర్ వర్మపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఇక దీనికి దర్శకుడు సుధీర్ వర్మ కూడా క్లారిటీ ఇచ్చాడు. కేశవం కాపీగా అంటున్న క్రాంక్ మూవీ తాను చూడలేదని.. బిబిసి టివి సీరీస్ హజిల్ ను ప్రేరణగా తీసుకుని ఈ కథ రాశానని అన్నారు. కాపీ కథ అయినా కాకపోయినా ప్రేక్షకులు దాన్ని పట్టించుకోరు ఫైనల్ గా అవుట్ పుట్ ఎలా ఉందని చూస్తారంతే.. విభిన్న కథలతో ముందుకు దూసుకెళ్తున్న నిఖిల్ ఈ సినిమా హిట్ కొడితే స్టార్ క్రేజ్ దక్కించుకున్నట్టే.