
బాహుబలికి ముందు దాకా చిత్ర పరిశ్రమలో బడ్జెట్ పరిమితులు ఉండేవి. ఎప్పుడైతే బాహుబలి వచ్చి అంచనాలకు మించి వసూళ్లను రాబట్టిందో అప్పుడే ఇక మిగతా వారికి ధైర్యమొచ్చింది. ప్రస్తుతం బాహుబలి రేంజ్ లో కాదు కాదు అంతకుమించిన రేంజ్ లో సినిమా చేస్తున్నాడు తమిళ దర్శకుడు సముద్ర. జయం రవి, ఆర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సంఘమిత్ర అని పెట్టారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాహుబలికి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఫస్ట్ లుక్ మాత్రం అంచనాలను పెంచేసింది. ఎంతో ప్రెస్టిజియస్ గా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల దాకా ఉంటుందని టాక్. మరి 1500 కోట్ల దగ్గరకు చేరుకుంటున్న బాహుబలిని దాటేసే రేంజ్ లో సంఘమిత్ర ఉంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెపs్పలేం.