ఇదో కొత్తరకం పబ్లిసిటీనా బాబు..!

హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా చేసిన రాహుల్ ఆ తర్వాత ఏవో రెండు మూడు సినిమాలు చేసినా అతంగా ప్రభావితం చూపలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన వెంకటాపురం మాత్రం రాహుల్ ను కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. సినిమా ఎలా ఉన్నా గుడ్ అటెంప్ట్ అనే టాక్ వచ్చింది. అందుకే ఈ టాక్ తో ఇంకాస్త పబ్లిసిటీ తోడైతే బాగుంటుందని చిత్రయూనిట్ సినిమా మొదటి 8 నిమిషాలు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ కాబట్టి 8 నిమిషాలు చూసిన ఆడియెన్స్ కచ్చితంగా మిగతా కథ ఏంటని థియేటర్ కు వెళ్లాలని అనుకుంటారు. ఇప్పటికే లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుంది. అందుకే ఈ 8 నిమిషాల సినిమా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇలాంటి పబ్లిసిటీ జిమ్మిక్కులు ఎన్నో సినిమాలు చేసినా వెంకటాపురం సినిమా విషయంలో మాత్రం ఇదేదో వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.