
బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి హీరో రానాల మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్వీటీ అనుష్క. ఇంటర్వ్యూ చేసిన వ్యాఖ్యాత ప్రభాస్ రానా లలో ఎవరు సెక్సీ అని అడుగగా.. ప్రభాస్ అని చెప్పేసింది అనుష్క. ఏం రానా ఎందుకు కాదు అని అడుగగా రానా తనకు బ్రదర్ లాంటి వాడని అన్నది.
ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. కుదిరితే ప్రభాస్ తో మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని అంటుంది అనుష్క. చూస్తుంటే అనుష్క దృష్టి మొత్త మన బాహుబలి మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ ఇలాంటి హీరోయిన్స్ బెడద నుండి తనని తాను ఎలా కాపాడుకుంటున్నాడో ఏమో అని అంటున్నారు సిని జనాలు.