
ఎన్టీఆర్ కు కన్నడ పరిశ్రమలో అవార్డ్ రావడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. లాస్ట్ ఇయర్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన చక్రవ్యూహ కోసం ఎన్టీఆర్ పాట పాడాడు. ఆ సినిమా సంగీత దర్శకుడు థమన్ తో ఉన్న స్నేహంతో పాట పాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పాట ఎన్టీఆర్ కు కన్నడలో అవార్డ్ తెచ్చిపెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి.
ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో డెబ్యూ సింగర్ కేటగిరిలో నామినేట్ అయ్యింది. ఓ భాషలో స్టార్ హీరో మరో భాషలో సింగర్ గా డెబ్యూ అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఈ అవార్డ్ వస్తే ఈ కేటగిరిలో అవార్డ్ అందుకున్న మొదటి హీరో ఎన్టీఆర్ అవుతాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు.