
అక్కినేని నాగ చైతన్య క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో చేసిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. మే 26న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ అయితే సినిమా పక్కా హిట్ అంటుంది. తన కెరియర్ లో బ్రమరాంబ లాంటి పాత్ర ఇంతవరకు చేయలేదని.. తనకే చాలా కొత్తగా అనిపించిందని చెబుతుంది అమ్మడు.
క్యారక్టర్ నచ్చేయడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ గా వర్క్ చేసిందట. అంతేకాదు కథలో హీరో కన్నా తన డామినేషన్ ఎక్కువగా ఉంటుందని అంటుంది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. డిఎస్పి మ్యూజిక్ తో వస్తున్న ఈ మూవీ ఆల్బం లో రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఇప్పటికే ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.