
అక్కినేని నాగార్జున ఇంట మరో విశాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల భర్త అనుమోలు సత్యభూషన్ రావు ఈరోజు ఉదయం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో భాధ పడుతున్న సత్యభూషణ్ రావు ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.
సత్య భూషణ్, నాగ సుశీల తనయుడు సుశాంత్ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. నాగ్ కార్పోరేషన్ తో నాగ సుశీల సినిమాలను నిర్మిస్తున్నారని తెలిసిందే. తనయుడిని హీరోగా నిలబెట్టే క్రమంలో సుశాంత్ సినిమాలు వారే నిర్మిస్తున్నారు. బావ మరణంతో ఈరోజు నాగార్జున నిర్మిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.