
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలావాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అందరు అనుకున్నట్టుగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని టైటిల్ ఫిక్స్ చేయరని తెలుస్తుంది. కేవలం అది వర్కింగ్ టైటిల్ మాత్రమే అట.. అసలు టైటిల్ సినిమా పూర్తి అయ్యే సమయానికి వెళ్లడిస్తారట.
మొన్నటిదాకా కేవలం తెలుగులోనే చేద్దామనుకున్న ఈ సినిమాను నేషనల్ వైడ్ గా తెరకెక్కించాలని చూస్తున్నారు. అందుకే ఉయ్యాలవాడ టైటిల్ కన్నా వేరే ఏదైనా పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా చిరు బర్త్ డే రోజున స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్ చేస్తారట.