
కింగ్ నాగార్జున ఎంత మంచి నటుడో అంతే మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల మీద ఆడియెన్స్ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా అవుట్ పుట్ వచ్చేలా చూస్తాడు. ప్రస్తుతం నాగార్జున నిర్మిస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తుంది మే 26న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై పాజిటివ్ టాక్ ఉంది.
సినిమా పాటలను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్న చిత్రయూనిట్ మే 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే టైటిల్ సాంగ్ తో పాటుగా నీవెంటే నేనుంటే సాంగ్ రిలీజ్ చేశారు. ఇక థర్డ్ సాంగ్ గా బ్రమరాంభకు నచ్చేశాను సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. ఈ సాంగ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది. దేవి మార్క్ మ్యూజిక్ తో సాగర్ పాడిన ఈ పాట నాగార్జునను పడగొట్టేసిందట. ఈ సాంగ్ థియేటర్ లో ఆడియెన్స్ అందరికి స్టెప్స్ వేసేలా చేస్తుందని అంటున్నారు. నాగ్ కు నచ్చింది అంటే తప్పకుండా ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది.