
బాహుబలితో తమ కలని సాకారం చేసుకున్న తండ్రి కొడుకులు విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తమకు దక్కాల్సిన క్రెడిట్ అంతా కొట్టేశారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటి అంటే ఇంత ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏది అని. దీనికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నా ఫైనల్ గా ఏదన్నది తెలియట్లేదు.
ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఆ సీక్రెట్ విప్పేశాడు. రాజమౌళి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో తెలియదు కాని తనకు మాత్రం గ్రాఫిక్స్ లేని కథ రాయమని చెప్పాడట. సో జక్కన్న నెక్స్ట్ మూవీలో గ్రాఫిక్స్ మాత్రం ఉండవని చెప్పొచ్చు. బాహుబలి కన్ క్లూజన్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి చేయబోయే తర్వాత సినిమా మీద అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం రాజమౌళితో సినిమా కోసం స్టార్ హీరోలంతా ఎదురుచూస్తున్నారు.