
బాహుబలి రెండు పార్టుల సంచలనాలు అందరికి తెలిసిందే. సినిమాలో నటించిన నటీనటులంతా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇక అందరికంటే ముందు ప్రధాన పాత్రధారులలో ఒకరు కట్టప్ప ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. అయితే బాహుబలి కథ అనుకున్న సమయంలో అసలు కట్టప్ప పాత్రకు మళయాల మెగాస్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని అనుకున్నారట.
సినిమా కథ కూడా అతనితో చర్చించారట. కాని ఒక్క సినిమా కోసం అన్నేళ్లు డేట్స్ ఇవ్వడం కష్టమని కాదనేశాడట. కట్టప్ప పాత్ర చేసిన సత్య రాజ్ దేశ నలుమూలల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒకవేళ అదే పాత్ర మోహన్ లాల్ చేసుంటే ఎలా ఉండేదో కాని కట్టప్ప అంటే సత్యరాజ్ గుర్తొచ్చేలా ఆ పాత్రకు జీవం పోశారు.