
గురు హిట్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకటేష్ ఈసారి అంచనాలను అందని కాంబినేషన్ లో సినిమా తీస్తుండటం విశేషం. గురు కంటే ముందే ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఎనౌన్స్ చేసి మళ్లీ బ్యాక్ అయిన వెంకీ ప్రస్తుతం క్రేజీ డైరక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నాడట. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో సూపర్ అనిపించుకున్న ప్రియదర్శన్ రీసెంట్ హిట్ మళయాల మూవీ ఒప్పం సూపర్ హిట్ సాధించింది.
తెలుగులో కనుపాపగా రిలీజ్ అయిన ఆ సినిమా చూసిన వెంకటేష్ ప్రియదర్శన్ కు ఫోన్ చేసి మరి స్పెషల్ విశెష్ అందచేశారట. అంతేకాదు తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఇలాంటి సినిమా లైన్ ఉంటే చెప్పమన్నట్టు టాక్. తెలుగులో బాలయ్యతో గాండీవం, నాగ్ తో నిర్ణయం సినిమాలు తీసిన ప్రియదర్శన్ తమిళ, హింది, మళయాల భాషల్లో చాలా సినిమాలు తీశారు. మరి వెంకటేష్ ఇమేజ్ తగ్గ కథతో ప్రియదర్శన్ ఇంప్రెస్ చేస్తాడో లేదో వేచి చూడాలి.