
ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి ఇండియన్ సినిమా చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసిన బాహుబలి మూవీ గురించి దేశమంతా ఒక్కటై జయ జయ రాగాలు పలుకుతుంటే ఒక్క బాలీవుడ్ హీరో కూడా ఆ సినిమా గురించి నోరు విప్పలేదని తెలిసిందే. హింది సినిమాల కన్నా బాహుబలి ఎక్కువ వసూళు చేసిందనే అక్కసుతోనో ఏమో కాని బాహుబలి మూవీ చూసి శభాష్ అన్న హీరో లేడు. కేవలం 1000 కోట్ల కలక్షన్స్ దాటాక ఏదో మొక్కుబడిగా మాట్లాడారంతే.
సినిమా రిలీజ్ అయిన ఇన్నాళ్లకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బాహుబలి చూశాడట. సినిమా చూసి బయట సినిమాపై మీడియాలో వస్తున్న వార్తలన్ని నిజమేననిపిస్తుంది అన్నాడు అక్షయ్. సినిమా చూడడానికి ఇన్ని రోజులకు వీలు పడింది.. సినిమాలో ప్రతి ఫ్రేం అద్భుతం.. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్టేజ్ పై నిలబెట్టిన రాజమౌళికి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. ఇక బాహుబలి గురించి రణ్ వీర్ సింగ్ కూడా తన రెస్పాన్స్ అందించాడు. బా..హు..బ..లి.. ఓ మై ఎఫ్ గాడ్ అంటూ ట్వీట్ చేశాడు రణ్ వీర్ సింగ్. మొత్తానికి బాహుబలి గురించి ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోలు మెచ్చుకోవడం హాట్ న్యూస్ అవుతుంది.