
సూపర్ స్టార్ రజినికాంత్ దాదాపు 8 ఏళ్ల తర్వాత తన ఫ్యాన్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో మంచి ఫాంలో ఉన్న సమయంలో ప్రతి ఆరు నెలలకు ఓ మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్ సినిమాల ప్రణాళికల గురించి రజిని మాట్లాడుతుండేవాడు. అయితే ఈమధ్య అంతగా వీలు కుదరకపోవడంతో ఫ్యాన్స్ మీట్ జరుగలేదు. ఇక నిన్న జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తను పా.రంజిత్ డైరక్షన్ లో తీసే సినిమా హాజి మస్తాన్ గురించి కాదని వివరణ ఇచ్చారు రజిని.
ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. ఇప్పటిదాకా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఏమి లేదు దేవుడు కరుణిస్తే తప్పకుండా వస్తా.. ఇక ఇప్పుడున్న ఏ పార్టీకి తన సపోర్ట్ ఉండదని చెప్పిన రజిని డబ్బుకి మదం ఉన్న ఏ ఒక్కరికి తన దగ్గర స్థానం ఉందడని అన్నారు. ఇక హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా తన వెంటే ఉన్న అభిమానులందరికి తను ఋణపడి ఉంటానని అన్నారు. పా.రంజిత్ మూవీ జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని.. అందులో ముంబై డాన్ గా కనిపిస్తానని అన్నారు రజినికాంత్.