నయన్ నుండి మరో సస్పెన్స్ థ్రిల్లర్..!

నయనతార లీడ్ రోల్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా పుదియ నియమం సినిమా తెలుగులో వాసుకిగా రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మళయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సినిమాగా నిలచిన ఈ మూవీలో నయనతారతో పాటు మమ్ముట్టి కూడా నటించడం విశేషం. సినిమా మొత్తం నయన్ క్యారక్టర్ మీదే నడుస్తుందట. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ఓ ముగ్గురు వ్యక్తులను చంపాలనుకున్న నయన్ వారిని ఎలా చంపింది. అసలు వారిని ఎందుకు నయన్ చంపాల్సి వచ్చింది అన్నది అసలు కథ. నయనతార ఇలాంటి సస్పెన్స్ సినిమాలను చేయడంలో ఆరితేరింది. ఇప్పటికే తెలుగులో మయూరి సినిమా తెలుగు ఆడియెన్స్ కు అసలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే ఇదేరా అనేలా చేసింది. మరి అదే క్రమంలో వస్తున్న ఈ వాసుకి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.