
కుర్ర హీరోల్లో కొత్త కొత్త కథలతో ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ అదే రేంజ్ సక్సెస్ ను కూడా అందుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ నోట్ల రద్దు టైంలో భయపడకుండా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రిలీజ్ చేసి సంచలన విజయం అందుకున్న నిఖిల్ మే 19న కేశవ సినిమాతో రాబోతున్నాడు.
స్వామిరారా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథ విచిత్రంగా ఉంది. కుడి పక్కన గుండె ఉండే కుర్రాడి కథే కేశవ. అలాంటి వారు కొంత టెన్షన్ పడినా హార్ట్ స్ట్రోక్ తో చనిపోతారు అలాంటి హీరో రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ కథ రాసుకోడానికి స్వామిరారా సినిమాలో నటించిన సత్య కారణమట. సత్యకు తెలిసిన అన్నయ్య ఒకతను కుడిపక్క గుండెతో పుట్టాడట. అతని గురించి చెప్పగానే ఈ కథ మైండ్ లో తట్టిందట.. అలాంటి వారికి నిజంగానే ఉద్వేగానికి తట్టుకోలేరట. అతని స్పూర్తితోనే ఈ కథ రాసుకుని నిఖిల్ తో చేశాడట సుధీర్ వర్మ. నిఖిల్ కూడా కథ చెప్పగానే ఓకే చేశాడని.. రియల్ లైఫ్ లో అలాంటి పాత్ర ఉన్నా తనే సొంతంగా ఈ సినిమాలో గొప్పగా నటించాడని అన్నారు సుధీర్ వర్మ. మరి ఇంత కష్టపడిన నిఖిల్ కేశవతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.