నాని.. నాగార్జున మల్టీస్టారర్..?

నాచురల్ స్టార్ నాని.. కింగ్ నాగార్జున కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. అహా సిని ప్రియులకు అంతకుమించిన ఆనందం ఇంకొకటు ఉండదు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో సినిమాకు ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయట. ఓ బడా ప్రొడ్యూసర్ దగ్గరకు ఓ మల్టీస్టారర్ కథ వచ్చిందట. కథ విన్న ఆ నిర్మాత ఇది నాగార్జున నాని కలిసి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట.

మల్టీస్టారర్స్ కు తాను ఎప్పుడైనా రెడీ అంటున్న నాగ్ ఇప్పటికే మనం, ఊపిరి సినిమాలతో ఆ హవా కొనసాగిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా క్రేజీ కాంబినేషన్స్ మల్టీస్టారర్ మూవీస్ రానున్నాయి. ఈ క్రమంలో నాగార్జునతో నాని మల్టీస్టార్ అదిరిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజు గారి గది-2 షూట్ లో నాగ్, నిన్ను కోరి పూర్తి చేసే పనిలో నాని ఉన్నారు. మరి ఈ ఇద్దరు కథ విని ఓకే అంటే ఓ రేర్ కాంబినేషన్ తెర మీద చూసినట్టే.