
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో చేస్తున్న సినిమా జై లవకుశ. తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ ను సైతం వాడేస్తున్నారు. ఇక సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సి.కె మురళీధరణ్ పనిచేస్తున్నారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కాని జై లవకుశ నుండి కెమెరామన్ తప్పుకున్నాడట.
దానికి కారణాలు మాత్రం బయట పడలేదు. ఇక ప్రస్తుతం చోటా కె నాయుడుతో మిగతా సినిమా పూర్తి చేస్తున్నారట చిత్రయూనిట్. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ మూవీగా వస్తున్న జై లవకుశ మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఈ నెల 20న తారక్ పుట్టినరోజు కారణంగా ఓ రోజు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ కం టీజర్ రెండు రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.