నోరు జారిన ఆలి.. అనసూయను అంత మాటనేశాడు

హాట్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతుంది. ఇక హీరోయిన్స్ మీద యాంకర్ల మీద నోటి ధూలతో పంచ్ లు వేసే ఆలి మరోసారి అనసూయ మీద నోరు జారాడు. రీసెంట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ కు యాంకర్లు గా ఆలి అనసూయలు వ్యవహరించారు. ఓ అవార్డ్ విషయంపై రాజ్ తరుణ్ ఒక్కడే వచ్చి అవార్డ్ ఇస్తుండగా తోడు ఎవరు లేరా అన్నాడు ఆలి. అయితే నేను ఉన్నా అంటూ అనసూయ రాజ్ తరుణ్ తో కలిసి ఆ అవార్డ్ అందించింది అనసూయ.     

అప్పుడు కంట్రోల్ తప్పిన ఆలి ఎవరు జత కావాలన్నా వెళ్లిపోతావా అని పంచ్ వేశాడు. ఆలి మాటలకు ఒక్కసారిగా షాక్ అయిన అనసూయ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయ్యింది. ఇక ఆ తర్వాత మళ్లీ తన యాంకరింగ్ తో సందడి చేసింది. ఇలాంటి కామెంట్స్ చేస్తున్న ఆలి మాటలను హీరోయిన్స్ కాని యాంకర్స్ కాని పట్టించుకోవడం మానేశారు. కాని ప్రేక్షకులు మాత్రం అదే పనిగా వారి మీద ఆలి వేస్తున్న పంచ్ లకు ఫైర్ అవుతున్నారు.