
నందమూరి వంశం నుండి మూడవ తరం నటుడు సినిమాల్లోకి అడుగు పెడుతున్నాదంటే, అంచనాలు మామూలుగానే తారా స్థాయిలో ఉంటాయి. కాని మొదటి సినిమా నిన్ను చూడాలని తో వాటిని అందుకోలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నంబర్ 1 తో మాత్రం మంచి విజయం అందుకున్నారు. కెరీర్ మొదట్లోనే ఆది లాంటి బరువైన ఫ్యాక్షన్ కథ ఎంచుకున్న తారక్, ఆ సినిమా ఘన విజయం తో యాక్షన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
అలా అని యాక్షన్ కథలకే ఓటెయ్యకుండా, ఆదుర లాంటి విభిన్న మైన క్యారెక్టర్ ఉన్న కథలకు కూడా తారక్ ముందుంటాడు. యమదొంగ చిత్రంలో అధ్బుతమైన నటనని ప్రదర్శించి, పౌరాణిక చిత్రాలు చేయాలంటే, నేటి తరంలో అది కేవలం, తారక్ కే సాధ్యం అని విమర్శకుల చేత కూడా అనిపించాడు. అయితే బృందావనం, టెంపర్ లాంటి ఓ మోస్తారు విజయాలు ఉన్న, సింహాద్రి రేంజ్ సినిమా కోసం, ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనత గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమాలోని తన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన సంపాదించాడు. సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తూ, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుందాం.
హీరో అయ్యి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తారక్ కు మై తెలంగాణా .కామ్ నుండి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.