
అక్కినేని నాగ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా నటించిన మళయాల భామ మంజిమా మోహన్ ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ కు వార్నింగ్ ఇస్తుంది. ఇంతకీ విషయం ఏంటి అంటే మీరు న్యూడ్ గా నటిస్తారా అని ఎవరో ఓ అభిమాని అడిగాడట. హీరోయిన్స్ న్యూడ్ గా చేయాల్సిన అవసరం ఏముంది.. కేవలం స్కిన్ తోనే సినిమాలు నడువవు.. కథ ఉంటేనే సినిమా ఆడుతుందని క్లాస్ పీకిందట.
ప్రేక్షకులు హీరోయిన్స్ న్యూడ్ సీన్స్ చూసేందుకే ఇష్టపడతారంటూ ట్వీట్ చేసిన వ్యక్తికి మంజిమా ఇచ్చిన రెస్పాన్స్ ఇది. ఆమె మాటలకు కొందరు ఏకీభవిస్తున్నా మరికొందరు మాత్రం ఆమెను రకరకాల ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారట. మరి పోయి పోయి అలాంటి ట్వీట్స్ కు రిప్లై ఇవ్వాలనుకోవడం మంజిమా తెలివి తక్కువ పని అనుకోవాల్సిందే.