ప్రభాస్ తో కత్రినా రొమాన్స్..!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ బాహుబలితో పాటే వచ్చి ఫ్యాన్స్ ను అలరించింది. యువి క్రియేషన్స్ పతాకంలో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటిదాకా హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ కాలేదు. కన్నడ హీరోయిన్ రశ్మికను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నా ఆమె ఇప్పటికే తెలుగులో నాగ శౌర్యతో ఓ సినిమా కమిట్ అవగా రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.

అందుకే ఈసారి బాలీవుడ్ భామతో రొమాన్స్ చేయాలని చూస్తున్నాడట ప్రభాస్. తెలుస్తున్న సమాచారం ప్రకారం సాహోలో ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ నటించే అవకాశాలున్నాయట. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన కత్రినా ఈమధ్య అక్కడ బాగా వెనుకపడ్డది. స్టార్స్ అవకాశాలు రాకున్నా కుర్ర హీరోలతో కూడా అమ్మడు ఏమాత్రం ఆకట్టుకోవట్లేదు. అందుకే సౌత్ సినిమాల మీద కన్నేసిందట. సాహో తెలుగు తమిళ హింది భాషల్లో రాబోతుంది అందుకే కత్రినా అయితే బీ టౌన్ లో మార్కెట్ కూడా పెరుగుతుందని దర్శక నిర్మాతల ఆలోచన. ఇప్పటికే తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించిన కత్రినా ప్రభాస్ సాహోతో లాంగ్ గ్యాప్ లో టాలీవుడ్ తెరపై కనిపించనుంది. మరి హిట్ కోసం తపిస్తున్న కత్రినాకు టాలీవుడ్ మళ్లీ కెరియర్ కు మంచి బూస్టప్ ఇవ్వాలని ఆశిద్దాం.