
ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి ప్రస్థానం గురించి అందరికి తెలిసిందే. ఇండియాలోనే 1000 కోట్ల కలక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా చూసిన సిని ప్రముఖులు దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, విలన్ రానాలను ఆకాశానికెత్తేశారు. బాహుబలి సినిమాపై కమల్ హాసన్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వసూళ్ల పరంగా ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి చాలా అవసరం.. చిత్రయూనిట్ కూడా సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. అయితే హాలీవుడ్ సినిమాల మించి ఉంది అనడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. సినిమా మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయని.. కాబట్టి హాలీవుడ్ ను మించిపోతుంది అనేదానికి తాను అంగీకరించనని ముక్కుసూటిగా చెప్పారు కమల్. ఓవిధంగా చెప్పాలంటె కమల్ చెప్పిన దానిలో కూడా నిజం ఉందని ఒప్పుకోవచ్చు. ఏది ఏమైతేనేం బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేసింది. ఇలాంటి ప్రయోగాలు చేసే వారికి ఈ సినిమా ఓ మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.