
బాహుబలి స్పూర్తితో ఐదువందల కోట్లతో రామాయణం చేస్తున్నామని ప్రకటించాడు గీతా ఆర్ట్స్ అధినేత్త అల్లు అరవింద్. మరో ఇద్దరు నిర్మాతలతో అరవింద్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే. ఇక ఈ సినిమాలో రాముడిగా ఎవరు చేస్తున్నారు అన్నది అందరు తెలుసుకోవాలనుకునే ప్రశ్న. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రామాయణంలో రాముడిగా చేస్తాడని అంటున్నారు. ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు కాని రావణుడిగా మాత్రం రానా ఫిక్స్ అంటున్నారు.
బాహుబలిలో భళ్లాలదేవగా అదరగొట్టిన రానా విలన్ పాత్రలకే ఓ కొత్త రూపం తెచ్చాడు. హీరో ఇమేజ్ తో విలన్ గా చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో చూపిస్తున్న రానా మరోసారి రామాయణంలో రావణుడిగా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. రావణబ్రహ్మగా రానా ఎలా ఉండబోతాడో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబందించి దర్శకులు స్టార్ కాస్ట్ ఫైనల్ గా ఎవరన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.