పూరి కోసం బాలయ్య కొత్త అవతారం

కేవలం నటనలోనే కాదు అన్నిరంగాల్లో కూడా దూసుకెళ్తాం అంటున్నారు ఈనాటి సూపర్ స్టార్లు. ఇక కొంతమంది దర్శకులతో సినిమాలు తీస్తే కేవలం హీరోగానే కాదు మిగతా వాటిల్లో కూడా వేలు పెట్టేలా చెస్తారు. వారిలో పూరి జగన్నాధ్ ముందుంటాడు. ఇప్పటికే తన సినిమాల్లో నటించిన మహేష్, ఎన్.టి.ఆర్ లతో పాట పాడించిన పూరి ప్రస్తుతం బాలయ్యను వదల్లేదు.

పూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య చేత ఓ పాట పాడించేస్తున్నాడు పూరి. హుద్ హుద్ తుఫాన్ టైంలో బాలయ్య తన సినిమాలోని ఓ పాట మొత్తం పాడి అలరించాడు. ఆ స్పూర్తితోనే బాలయ్యతో పాట పాడించేస్తున్నాడు సంగీత దర్శకుడు అనూప్. సినిమాలో బాలయ్య పాట కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా చూస్తున్నారట.