
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ కు తగ్గ సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే బాహుబలి షూటింగ్ గ్యాప్ లో సుజిత్ తో సినిమా ఫిక్స్ అయిన ప్రభాస్ ప్రస్తుతం డైలమాలో పడ్డాడట. రన్ రాజా రన్ సినిమా తర్వాత సుజిత్ చేస్తున్న సెకండ్ మూవీనే సాహో. బాహుబలి-2తో పాటుగా సాహో టీజర్ కూడా రిలీజ్ చేశారు.
కేవలం ప్రభాస్ ఇట్స్ షో టైం అన్నది తప్ప టీజర్ లో ఏమాత్రం కిక్ లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై మల్లగుల్లాలు పడుతున్నారట చిత్రయూనిట్. ప్రభాస్ డైరెక్టర్ సుజిత్ ను మందలించాడని కూడా ఫిల్మ్ నగర్ టాక్. యువి క్రియేషన్స్ పతాకంలో రాబోతున్న ఈ సినిమా నిజంగానే ఆపేస్తారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ప్రభాస్ కోసం రెండేళ్లు వెయిట్ చేసి మరి సాహో తీస్తున్న సుజిత్ కు ఈ సినిమా ఆగితే పెద్ద దెబ్బే అవుతుంది.