విజయనిర్మలకు అరుదైన గౌరవం..!

కథానాయికగా కాదు దర్శకురాలిగా కూడా విజయ నిర్మల తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. నటిగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే కాకుండా దర్శకురాలిగా విజయ నిర్మల ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించారు. లేడీ డైరక్టర్ గా ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేసిన రికార్డ్ ఇంకా ఆమె పేరు మీదే ఉంది. ఇక ఇప్పుడు ఆమెకు గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తున్నారు.

యూకెకు చెందిన రాయల్ అకాడెమీ గ్లోబల్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు విజయ నిర్మల. 1957లో నటిగా తెరంగేట్రం చేసిన విజయ నిర్మల తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ప్రేక్షకులను రంజింపచేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎక్కువ సినిమాల్లో నటించి ఆయనను మరళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.