మహేష్ స్పైడర్ టీజర్ రిలీజ్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ టీజర్ గురించి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న స్పైడర్ మూవీని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సెట్స్ మీద ఉన్న మహేష్ ఏ సినిమా అయినా సరే కృష్ణగారి బర్త్ డే వస్తే చాలు పోస్టర్ కాని టీజర్ కాని రిలీజ్ చేసి విష్ చేయడం ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితి. ఇక దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సారి స్పైడర్ టీజర్ కూడా సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా వస్తుందని తెలుస్తుంది. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ టీజర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.