
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినపడుతుండటం విశేషం.
ఇంజినీర్ బాబు దగ్గర నుండి పరదేశ ప్రయాణం దాకా టైటిల్స్ గా ప్రచారం జరుగగా తాజాగా ఇప్పుడు గోకుల కృష్ణుడు అని కొత్త టైటిల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గోపాల గోపాల సినిమాలో ఆల్రెడీ పవన్ కృష్ణుడిగా నటించి మెప్పించాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేయబోతున్నాడట.
అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్ల దాకా ఉంటుందని టాక్. రాధాకృష్ణ మాత్రమే కాదు ఇంత భారీ రేంజ్ సినిమా డైరెక్ట్ చేయడం త్రివిక్రం కు కూడా మొదటిసారే అవుతుంది. తన మాటలతో మాయ చేసే త్రివిక్రం ఈసారి బడ్జెట్ కూడా పెంచాడంటే కచ్చితంగా మళ్లీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేయొచ్చు.